విషాదం.. అదుపు త‌ప్పి చేప‌ల చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్ట‌ర్.. 5 గురు మృతి

Tractor accident in Nellore.నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు త‌ప్పి చేప‌ల చెరువులోకి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 May 2021 8:18 AM GMT
tractor accident

నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు త‌ప్పి చేప‌ల చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. వివ‌రాల్లోకి వెళితే.. నెల్లూరు రూర‌ల్ మండ‌లానికి చెందిన కృష్ణవేణి(26), కిలారి హరిబాబు(43), లాలి లక్ష్మీకాంతమ్మ(45), అబ్బుకోటి పెంచాలయ్య(60), తాంధ్రా వెంకతరమనమ్మ(19) లు పుచ్చ‌కాయ‌లు కోసేందుకు ట్రాక్ట‌ర్‌లో వెలుతున్నారు. వీరు ప్ర‌యాణిస్తున్న ట్రాక్ట‌ర్.. గోల్లకందుకురు స‌మీపంలోకి వ‌చ్చేస‌రికి అదుపు త‌ప్పింది. అనంత‌రం ప‌క్క‌నే ఉన్న‌ చేప‌ల చెరువులో ప‌డింది.

ఈ ప్ర‌మాదంలో ట్రాక్ట‌ర్‌లో వెలుతున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను చెరువులోంచి వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story
Share it