నల్గొండ హత్యకేసు.. మొండెం లభ్యం.. ఎక్కడ దొరికిందంటే.!

Torso found on a private building in rangareddy district. ఇటీవల ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

By అంజి  Published on  13 Jan 2022 2:14 PM GMT
నల్గొండ హత్యకేసు.. మొండెం లభ్యం.. ఎక్కడ దొరికిందంటే.!

ఇటీవల ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చింతపల్లి మండలం విరాట్‌నగర్‌ మహంకాళీ అమ్మవారి విగ్రహం పాదాల దగ్గర తలను ఉంచి మొండెను మాయం చేశారు దుండుగులు. తాజాగా ఈ హత్య కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. హత్యకు గురైన బాధితుడి మొండెం ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌ దగ్గర శిరస్సు లేని మొండం లభ్యం అయ్యింది. ఇళ్ల మధ్యలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకు బిల్డిండ్‌ మీద తల లేని మొండెంను పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్య ఘటన జరిగిన 3 రోజుల తర్వాత మొండెం లభించింది.

హత్యకు గురైన వ్యక్తి సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యపహాడ్‌ తండాకు చెందిన రమావత్‌ జయేందర్‌ నాయక్‌ (30). మృతుడిని ఇప్పటికే పోలీసులు, కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే ఈ కేసుకు సంబంధించి లభ్యమైన మొండెంకు పోస్టుమార్టం చేసిన పోలీసులు అధికారిక ప్రకటన చేయనున్నారు. చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలోని మెట్టు మహంకాళి ఆలయంలో మహంకాళి అమ్మవారి విగ్రహం పాదాల వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి శిరచ్ఛేదమైన తలను స్థానికులు గుర్తించారు. ఈ దారుణ దృశ్యం స్థానికుల్లో కలకలం రేపింది. అయితే ఈ హత్యకు పాల్పడిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Next Story
Share it