కొమురం భీం జిల్లాలో దారుణం : పెద్దపులి దాడిలో యువకుడు మృతి

Tiger Attack In Komaram Bheem District. కుమ్రం భీం ఆసిఫాబాద్ ‌జిల్లాలోని ద‌హేగాం మండ‌లంలోని దిగెడ గ్రామంలో పెద్ద పులి

By Medi Samrat  Published on  11 Nov 2020 10:59 AM GMT
కొమురం భీం జిల్లాలో దారుణం : పెద్దపులి దాడిలో యువకుడు మృతి

కుమ్రం భీం ఆసిఫాబాద్ ‌జిల్లాలోని ద‌హేగాం మండ‌లంలోని దిగెడ గ్రామంలో పెద్ద పులి బీభ‌త్సం సృష్టించింది. దిగెడ గ్రామ స‌మీపంలో ప‌శువుల‌ను మేపుతున్న గ‌ణేశ్‌(22) అనే యువ‌కుడిపై పెద్ద‌పులి దాడి చేసింది. అంత‌టితో ఆగ‌కుండా గ‌ణేశ్‌ను అట‌వీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. గ‌ణేశ్‌తో పాటు మ‌రో యువ‌కుడు కూడా ప‌శువుల‌కు కాప‌లాగా ఉన్నాడు.

భ‌యంతో ఆ యువ‌కుడు అరుచుకుంటూ గ్రామంలోకి ప‌రుగెత్తుకొచ్చాడు.. యువ‌కుడి అరుపులు విన్న‌ గ్రామ‌స్తులంతా క‌లిసి అడ‌వి వైపు వెళ్లారు. స్థానికుల అరుపుల‌కు భ‌య‌ప‌డిన పెద్ద పులి గ‌ణేశ్‌ను వ‌దిలేసి వెళ్లిపోయింది. అయితే గ‌ణేశ్ అప్ప‌టికే పెద్ద‌పులి దాడిలో గ‌ణేశ్ ప్రాణాలు కోల్పోయాడు.

గ్రామ‌స్తుల స‌మాచారంతో ఘ‌ట‌నాస్థ‌లికి అట‌వీశాఖ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గ‌ణేశ్ మ‌ర‌ణంతో అత‌డి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.


Next Story
Share it