Hyderabad: అమీర్‌పేటలోని మొబైల్‌ రిపేర్‌ షాపులో డిష్యూం.. డిష్యూం.. వీడియో

అమీర్‌పేటలోని మొబైల్ రిపేర్ షాపుపై దాడి చేసిన ఏడుగురు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

By అంజి  Published on  3 July 2024 9:45 AM IST
attack, mobile repair shop, Ameerpet, Hyderabad

Hyderabad: అమీర్‌పేటలోని మొబైల్‌ రిపేర్‌ షాపులో డిష్యూం.. డిష్యూం.. వీడియో

హైదరాబాద్: అమీర్‌పేటలోని మొబైల్ రిపేర్ షాపుపై దాడి చేసిన ఏడుగురు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. దుండగులు షాపు సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా సామగ్రిని ధ్వంసం చేశారు. సంజీవ రెడ్డి నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్‌పేట ఆదిత్య ఎన్‌క్లేవ్‌ నీలగిరి బ్లాక్‌లో మొబైల్‌ రిపేర్‌ షాపు యజమాని నికేష్‌కుమార్‌కు డబ్బు చెల్లింపు పెండింగ్‌ విషయంలో అఖిల్‌(26)తో గొడవ జరిగింది.

కూకట్‌పల్లికి చెందిన అఖిల్‌.. నికేశ్‌ కుమార్‌ దుకాణానికి రిపేర్‌ కోసం మొబైల్‌ ఫోన్లు తెచ్చేవాడు. పేమెంట్ లేకుండా రెండు ఫోన్ల డిస్ ప్లేలు తీసుకున్న అఖిల్.. రిపేర్ కోసం మరో ఫోన్ తీసుకొచ్చాడు. అయితే, కొత్త రిపేర్‌ను అంగీకరించే ముందు నికేష్ కుమార్ మునుపటి రిపేర్‌లకు డబ్బులు చెల్లించాలని పట్టుబట్టారు.

సోమవారం సాయంత్రం ఆరుగురు స్నేహితులతో కలిసి నీలగిరి బ్లాక్‌లోని నికేశ్‌ కుమార్‌ దుకాణానికి వెళ్లిన అఖిల్‌ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆపై గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే షాపులోని ఉద్యోగులు శశికుమార్, ముఖేష్ కుమార్‌లు గాయపడ్డారు. స్క్రూడ్రైవర్లు, ఇతర పనిముట్లతో తీవ్రంగా కొట్టారు. అదనంగా, దుకాణంలోని సామగ్రి చాలా ధ్వంసమైంది.

ఈ ఘటనపై నికేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. CCTV ఫుటేజీని పరిశీలించిన తర్వాత, పోలీసులు అఖిల్, అతని ఆరుగురు సహచరులపై BNS చట్టంలోని సెక్షన్ 190తో పాటు ఇతర సెక్షన్లు 118(1), 324(4), 351(3) కింద కేసు నమోదు చేశారు. మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సంజీవరెడ్డి నగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.

Next Story