ఘోరం.. మూడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

Three Year Old Girl Allegedly molested By two Men In Delhi.మూడేళ్ల చిన్నారిపై ఇద్ద‌రు వ్య‌క్తులు అత్యాచారానికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2023 10:22 AM IST
ఘోరం.. మూడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

దేశంలో ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. కామంతో క‌ళ్లు మూసుకుపోయిన కామాంధులు చిన్న‌పిల్ల‌ల నుంచి వ‌య‌స్సు మ‌ళ్లిన వారిని సైతం వ‌ద‌ల‌డం లేదు. మూడేళ్ల చిన్నారిపై ఇద్ద‌రు వ్య‌క్తులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగింది.

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్‌ బేరీ ప్రాంతంలో ఓ మూడేళ్ల బాలిక త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. శుక్ర‌వారం(ఫిబ్ర‌వ‌రి 3) ఉద‌యం నుంచి ఆ బాలిక క‌నిపించ‌కుండా పోయింది. దీంతో కంగారు ప‌డిన త‌ల్లిదండ్రులు బాలిక కోసం చుట్టు ప‌క్క‌ల అంతా గాలిస్తుండ‌గా.. త‌మ పొరుగింటిలో నివాసం ఉండే ఓ మ‌హిళ బాలిక‌ను తాను అడ‌వికి స‌మీపంలో చూశాన‌ని, బాలిక వెంట ఇద్ద‌రు వ్య‌క్తులు ఉన్న‌ట్లు చెప్పింది.

దీంతో బాలిక త‌ల్లిదండ్రులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని వెతుకుతుండ‌గా ఓ చోట చిన్నారి ఏడుస్తూ క‌నిపించింది. ర‌క్త‌స్రావం అవుతున్న బాలిక‌ను చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ దారుణానికి పాల్ప‌డింది రామ్‌నివాస్‌ పానిక (27), శక్తిమాన్‌ సింగ్‌ (22)గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. వారిద్ద‌రి వివాహాలు అయ్యాయ‌ని, స్థానికంగా ఓ గార్భేజ్ రీసైకిల్ కంపెనీలో ప‌ని చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Next Story