హైదరాబాద్‌లో విషాదం..స్విమ్మింగ్ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్ నగరంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది.
By - Knakam Karthik |
హైదరాబాద్‌లో విషాదం..స్విమ్మింగ్ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్ నగరంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ చిన్నారి ప్రాణం తీసింది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పూల్‌లో పడిన అర్జున్ కుమార్ (3) అనే మూడేళ్ల బాలుడు నీటిలో మునిగి మృతి చెందాడు. గేటెడ్ కమ్యూనిటీ లో ఆడుకుంటున్న అర్జున్ స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. పూల్ ప్రాంతంలో అప్పటికి ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో బాలుడు నీటిలోనే చిక్కు కుని ప్రాణాలు కోల్పోయాడు.
కొంతసేపటి తర్వాత బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వెతకగా, పూల్‌లో అతడు నీటిలో మునిగి ఉన్నట్టు గమనించిన వెంటనే బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.ఈ ఘటనతో గేటెడ్ కమ్యూనిటీ లో విషాద వాతావరణం నెలకొంది. చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న కె.పి.హెచ్.బి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.