తిరుపతిలో ఘోర విషాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పైనుంచి పడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. తుడా క్వార్టర్‌లో హెచ్‌ఐజీ బిల్డింగ్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. అయితే మంగళవారం మధ్యాహ్నం బిల్డింగ్‌పై పని చేస్తున్న ముగ్గురు కార్మికులు ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడిపోయారు. దీంతో తీవ్ర గాయాలైన వారు స్పాట్‌లోనే మరణించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా మృతులను శ్రీనివాసులు, వసంత్, శ్రీనివాసులుగా ఐడెంటిఫై చేశారు.