ఒకేసారి విషం తాగిన ఆరుగురు బాలికలు.. ప్రేమ వ్య‌వ‌హార‌మే కార‌ణం..!

Three teens dead after consuming poison in Aurangabad.ఆరుగురు బాలిక‌లు మంచి స్నేహితురాళ్లు. అంద‌రూ క‌లిసి మెలిసి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 April 2022 8:57 AM IST
ఒకేసారి విషం తాగిన ఆరుగురు బాలికలు.. ప్రేమ వ్య‌వ‌హార‌మే కార‌ణం..!

ఆరుగురు బాలిక‌లు మంచి స్నేహితురాళ్లు. అంద‌రూ క‌లిసి మెలిసి ఉండేవారు. అయితే.. ఒకేసారి వీరంతా విషం తాగి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించారు. వీరిలో ముగ్గురు మృతి చెంద‌గా.. మ‌రో ముగ్గురు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న బిహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న అక్క‌డ తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. కాస్మా ప్రాంతంలోని చిరాయిలాలో ఆరుగురు బాలిక‌లు నివ‌సిస్తున్నారు. వీరంద‌రి వ‌య‌స్సు 12 నుంచి 16 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉంటుంది. వీరిలో ఓ బాలిక ఓ అబ్బాయితో ప్రేమ‌లో ప‌డింది. ఈ విష‌యాన్ని త‌న స్నేహితురాళ్ల ద్వారా ఆ యువ‌కుడికి తెలియ‌జేసింది. అయితే.. ఆ యువ‌కుడు పెళ్లికి నిరాక‌రించాడు. దీంతో మ‌న‌స్థాపం చెందిన బాలిక.. త‌న స్నేహితురాళ్ల‌తో క‌లిసి గ్రామ స‌మీపంలోని చెరువు వ‌ద్ద‌కు వ‌చ్చారు. యువ‌కుడిని ప్రేమిస్తున్న బాలిక తొలుత విషం తాగింది.

దీన్ని చూసిన మిగిలిన ఐదుగురు కూడా విషం తాగారు. కొద్ది సేప‌టికి వీరిని గ‌మ‌నించిన స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చే స‌మ‌యానికే ముగ్గురు బాలిక‌లు మ‌ర‌ణించార‌ని వైద్యులు తెలిపారు. మిగిలిన ముగ్గ‌రు ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు చెప్పారు. విష‌యం తెలుసుకున్న ఔరంగాబాద్ ఎస్పీ కాంతేశ్ కుమార్ మిశ్రా ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. బాలికలంతా వేర్వేరు కుటుంబాల‌కు చెందిన వార‌న్నారు. అయితే.. వారంతా ఎందుకు విషం తాగారు అన్న‌దానిపై విచార‌ణ చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.

Next Story