16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం, ఇద్దరు అరెస్ట్
Three sexually assault 16-year-old girl in Jaipur, Two arrested. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికపై అదే పరిసరాల్లో నివసించే ముగ్గురు యువకులు
By అంజి Published on
2 March 2022 9:42 AM GMT

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికపై అదే పరిసరాల్లో నివసించే ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని నగర పోలీసులు పేర్కొన్నారు. డిసిపి (పశ్చిమ) రిచా తోమర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన ఆదివారం జరిగింది. మైనర్ తండ్రి సోమవారం పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఈ నేరానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆదివారం మధ్యాహ్నం బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బాలిక తండ్రి ఆ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి వెళ్లి చూడగా అక్కడ తన కూతురు కనిపించింది. బాలిక తండ్రికి కనిపించడంతో నిందితులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. బాలిక తన కుటుంబ సభ్యులకు తన బాధను వివరించగా, వారు సోమవారం నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్లతో పాటు ఐపీసీలోని సెక్షన్లు 376డీ (అత్యాచారం) కింద కేసు నమోదు చేయబడింది. అవసరమైన వైద్య ప్రక్రియను ముగించారు. నిందితులు సమీప ప్రాంతంలో కూలీలుగా పనిచేస్తున్నారు.
Next Story