హవాలా డబ్బు కేసును విచారించడం మొదలు పెట్టగా.. షాకింగ్ విషయాలు బయటకు

Three Pune cops among four held for looting man. ఔరంగాబాద్‌ నుంచి ముంబైకి హవాలా డబ్బును తీసుకెళ్తున్న వ్యక్తి నుంచి రూ. 45 లక్షలు దోచుకెళ్లినందుకు అరెస్టయిన నలుగురిలో

By Medi Samrat  Published on  14 March 2022 4:33 PM IST
హవాలా డబ్బు కేసును విచారించడం మొదలు పెట్టగా.. షాకింగ్ విషయాలు బయటకు

ఔరంగాబాద్‌ నుంచి ముంబైకి హవాలా డబ్బును తీసుకెళ్తున్న వ్యక్తి నుంచి రూ. 45 లక్షలు దోచుకెళ్లినందుకు అరెస్టయిన నలుగురిలో ముగ్గురు పూణే పోలీసులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసు అధికారులు కూడా ధృవీకరించారు. కారులో రూ. 5.50 కోట్లతో ఉన్న వ్యక్తిని మార్చి 8న ముంబై-నాసిక్ హైవేపై పెట్రోల్ పంపు దగ్గర నలుగురు వ్యక్తులు మోసం చేశారని థానే భివాండి ప్రాంతంలోని నార్పోలీ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ మదన్ బల్లాల్ తెలిపారు.

ఈ నలుగురు నిందితులు కారులో ఉన్న వ్యక్తి నుంచి రూ.45 లక్షలు తీసుకున్నారు. మార్చి 10 న కేసు నమోదు చేశారు. అధికారులు మొదట బాబూభాయ్ సోలంకి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో అతను మిగిలిన ముగ్గురికి సంబంధించిన సమచారం అందించాడు. వీరంతా పూణే పోలీసులని తెలుసుకుని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. పూణెలోని దత్తవాడి పోలీస్ స్టేషన్‌కు చెందిన గణేష్ షిండే, గణేష్ కాంబ్లే, దిలీప్ పిలానే అనే ముగ్గురిని శనివారం అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ మదన్ బల్లాల్ తెలిపారు.దోచుకున్న మొత్తంలో ఇప్పటి వరకు రూ. 5 లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకున్నామని, నిందితులని విచారించడం ద్వారా మొత్తం డబ్బుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోనున్నారు. పూర్తి మొత్తాన్ని రికవరీ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసు అధికారి తెలిపారు.

Next Story