అంత్య‌క్రియ‌ల‌కు వెలుతూ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మ‌ర‌ణం

Three Members of same family died in a road accident.బంధువుల అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రై వెలుతుండ‌గా.. మృత్యువు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Dec 2021 1:34 PM IST
అంత్య‌క్రియ‌ల‌కు వెలుతూ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మ‌ర‌ణం

బంధువుల అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రై వెలుతుండ‌గా.. మృత్యువు వారిని క‌బ‌లించింది. మ‌రో అర‌గంట‌లో చేరుకుంటామ‌ని అనుకుంటుండ‌గా.. వీరు ప్ర‌యాణిస్తున్న కారు టైరు పేలి ఎదురుగా వ‌స్తున్న ఓ వాహ‌నాన్ని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో కారులో ప్ర‌యాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క‌డిక్క‌డే మృతి చెందారు. జ‌న‌గామ జిల్లాలో ఈ రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. శేఖ‌ర్ రెడ్డి, ధ‌న‌ల‌క్ష్మీ భార్యాభ‌ర్త‌లు. వీరు కుమారుడు ర‌ఘుమారెడ్డితో క‌లిసి హైద‌రాబాద్‌లో నివాసం ఉంటున్నారు. తిరుమ‌ల‌గిరిలో బావ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు హైద‌రాబాద్ నుంచి తిరుమ‌ల‌గిరికి కారులో ముగ్గురు బ‌య‌లుదేరారు. జనగామ – సూర్యాపేట జాతీయ రహదారిపై లింగాల ఘనపురం మండలం వనపర్తి స్టేజీ స‌మీపంలోకి రాగానే వీరు ప్ర‌యాణీస్తున్న కారు టైరు పేలిపోయింది.

దీంతో కారు అదుపు త‌ప్పి తుమ్మ‌ల గూడెం నుంచి జ‌న‌గామ‌కు బ‌ర్రెల లోడుతో వెలుతున్న టాటా ఏస్ వాహానాన్ని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో కారులో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా.. టాటాఏస్ వాహాన డ్రైవ‌ర్‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుడిని జ‌న‌గామ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను కారులోంచి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story