రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది.

By Medi Samrat  Published on  15 Jan 2025 12:42 PM
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కల్వకుర్తి-నాగర్ కర్నూల్ రహదారి తర్ణికల్ సమీపంలో కారు, ఆటో ఢీ కొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. ఈ ప్ర‌మాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్ర‌మాద‌ స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన వారిని స్థానిక హాస్పిటల్ కి తరలించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story