దారుణం.. కుతూరిని ప్రేమించాడని హత్య.. 33 రోజుల తర్వాత
Three held for murder of youth missing for a month. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన కూతురిని ప్రేమించాడని ఓ యువకుడిని తండ్రి సుపారీ
By అంజి Published on 30 Oct 2022 12:12 PM ISTఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన కూతురిని ప్రేమించాడని ఓ యువకుడిని తండ్రి సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. అయితే ఈ ఘటన జరిగిన 33 రోజుల తర్వాత బాధితుడి మృతదేహం బయటపడింది. అదృశ్యమైన నెల రోజుల తర్వాత 21 ఏళ్ల యువకుడిని హత్య చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బిర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని కాంగ్రెస్ కార్పొరేటర్ ఇక్రమ్ అహ్మద్ మేనల్లుడు వహెజుద్దీన్ హుస్సేన్ అకా బాబు అనే యువకుడి మృతదేహాన్ని బీర్‌గావ్‌లోని ఖమ్తరాయ్ ప్రాంతం గుండా వెళుతున్న రైల్వే ట్రాక్ సమీపంలో పాతిపెట్టారు. తప్పిపోయిన సరిగ్గా 33 రోజుల తర్వాత శుక్రవారం సాయంత్రం యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు.
హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని కేసు విచారణలో తేలిందని ఉర్ల పోలీసులు తెలిపారు. ఈ నేరాన్ని బాలిక తండ్రి కరీం ఖాన్, ఫిరోజ్ ఖాన్, విశ్వనాథ్‌లు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి ఐపిసి సెక్షన్ 302, 120బి, 201, 34 కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నారు. యువకుడు వహాజుద్దీన్ సెప్టెంబర్ 25న కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత వహాజుద్దీన్ కోసం వెతికిన కుటుంబ సభ్యులు అక్టోబరు 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని పోలీసులకు తెలిపారు. ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
తన కూతురిని వహాజుద్దీన్ లవ్ చేస్తున్నాడన్న విషయం తండ్రి కరీంఖాన్కు తెలిసింది. తన కుమార్తెను ప్రేమించవద్దని వహాజుద్దీన్ను కరీంఖాన్ హెచ్చరించాడు. అయితే వహాజుద్దీన్ వినలేదు. దీంతో యువకుడిని హత్య చేసేందుకు కరీంఖాన్ మనుషులను మాట్లాడాడు. హత్యకు ప్లాన్ చేసి విశ్వనాథ్, ఫిరోజ్ ఖాన్ను పురమాయించాడు. వీరిద్దరూ కలిసి సెప్టెంబరు 25న వహాజుద్దీన్ను హత్యచేసి.. రామేశ్వర్ నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద పూడ్చిపెట్టేశారు. ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.