Andhrapradesh: ముగ్గురు కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని..

ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగి ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు యత్నించారు.

By అంజి  Published on  27 Nov 2024 11:47 AM IST
suicide , financial difficulties, Rajahmundry, APnews, Crime

Andhrapradesh: ముగ్గురు కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని..

ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగి ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు యత్నించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి జేఎన్‌ రోడ్డులోని సాయిసుధా రెసిడెన్సీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు.. ముగ్గురిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బిజినెస్‌లో ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల అనంతపురం జిల్లాలోని నార్పల మండలం కేంద్రం మెయిన్‌ బజార్‌లో ఉన్న పెద్దమ్మ సామీ గుడి వద్ద ఓ ఇంటిలో దంపతులు కృష్ణ కిషోర్‌, శిరీష, ఆరు నెలల కుమారుడు జయంత్‌కు ఉరివేసి, ఆ తర్వాత వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులను పగులగొట్టి చూడగా ఇంట్లో వేలాడుతున్న మృతదేహాలు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story