మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం.. క‌రెంట్ షాక్‌తో ముగ్గురు మృతి

Three Dies with Electric Shock in Mahabubabad District.మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దైవ కార్యం కోసం

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 21 Jun 2022 2:54 PM IST

మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం.. క‌రెంట్ షాక్‌తో ముగ్గురు మృతి

మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దైవ కార్యం కోసం వెళ్లిన ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘంతో మరణించడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘ‌ట‌న డోర్న‌క‌ల్ మండ‌లం అంద‌నాల‌పాడు గ్రామంలో చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివ‌రాల మేరకు.. అంద‌నాల‌పాడు గ్రామంలో గ‌ల రామాల‌యంలో మైకులు సెట్ చేస్తుండ‌గా.. ఓ వ్య‌క్తి విద్యుత్ షాక్‌కు గురైయ్యాడు. అత‌డిని ప‌ట్టుకుని ఉన్న మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు సైతం విద్యుదాఘాతానికి గుర‌య్యారు. దీంతో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మృతుల‌ను సుబ్బారావు (67) మస్తాన్ రావు(57), వెంకయ్య (55) లు గుర్తించారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని మృత‌దేహాల‌ను చూసి క‌న్నీరు మున్నీరుగా విల‌పించారు. మైకులు కడుతున్న పైపు ఇనుపది కావడం వలనే విద్యుత్ షాక్ జరిగిందని అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

Next Story