దారుణం.. బాలికపై ముగ్గురు సోదరుల అఘాయిత్యం
Three Brothers molested minor girl in Rajasthan.దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా
By తోట వంశీ కుమార్ Published on 11 March 2022 12:57 PM GMT
దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు వావి వరుస లేకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఓ మైనర్ బాలికపై ముగ్గురు సోదరులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బార్మర్ జిల్లాలో ఓ వ్యక్తి పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఓ 17 బాలికతో పరిచమైంది. ఈ క్రమంలో తన ఇంట్లో ఫంక్షన్ ఉందని బాలికను అతడు రమ్మన్నాడు. అయితే.. తాను రాలేనంటూ బాలిక చెప్పింది. అయినప్పటికీ అతడు బలవంతంగా బాలికను ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటితో అతడు ఆగలేదు. తన సోదరుడిని బాలికను అప్పగించాడు. అతడు.. తనతో పాటు బాలికను జోథ్‌పూర్ తీసుకువెళ్లి.. పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి నెలన్నర రోజుల పాటు బలాత్కారానికి తెగబడ్డాడు. అనంతరం అతడి మరో సోదరుడు కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని సోదరుడికి వివరించింది. సోదరుడి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.