ముగ్గురు ఆఫ్రికన్ మహిళలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. 5.68 కోట్ల విలువైన కొకైన్‌ను శానిటరీ న్యాప్‌కిన్‌లలో దాచి స్మగ్లింగ్ చేస్తుండడాన్ని గుర్తించారు. నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఆధారంగా, DRI ముంబై యూనిట్ స్మగ్లర్లను పట్టుకోడానికి గత మూడు రోజులుగా ఆపరేషన్ నిర్వహించింది.
ఇద్దరు ఉగాండా మహిళలు శానిటరీ న్యాప్‌కిన్‌లలో దాచిపెట్టిన నిషిద్ధ వస్తువులతో పట్టుబడ్డారు. ఒక టాంజానియా మహిళ కొకైన్‌తో కూడిన క్యాప్సూల్స్‌ను తీసుకున్నట్లు అధికారి తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టంలోని సంబంధిత నిబంధనల కింద ముగ్గురిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు అధికారులు తెలిపారు.