Video : గోడకు రంధ్రం చేసి వైన్ షాప్‌లోకి ప్ర‌వేశించాడు.. డ‌బ్బులు దొర‌క‌క‌పోవ‌డంతో..

వైన్ షాప్‌ను దోచుకుందామ‌ని వెళ్లాడు ఓ దొంగ‌.. అక్క‌డ డ‌బ్బులు దొర‌క‌క‌పోవ‌డంతో ఓ రెండు బాటిళ్లు మ‌ద్యం తీసుకుని వెళ్లాడు

By Medi Samrat  Published on  29 Nov 2024 3:25 PM IST
Video : గోడకు రంధ్రం చేసి వైన్ షాప్‌లోకి ప్ర‌వేశించాడు.. డ‌బ్బులు దొర‌క‌క‌పోవ‌డంతో..

వైన్ షాప్‌ను దోచుకుందామ‌ని వెళ్లాడు ఓ దొంగ‌.. అక్క‌డ డ‌బ్బులు దొర‌క‌క‌పోవ‌డంతో ఓ రెండు బాటిళ్లు మ‌ద్యం తీసుకుని వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలంలోని పాలమాకుల గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గ్రామంలో ఉన్న లక్ష్మీనరసింహ వైన్ షాప్‌ వెనక భాగంలో గోడకు రంధ్రం చేసి లోప‌లికి ప్రవేశించిన దొంగ‌.. సీసీ కెమెరా దిక్కు అసలు చూడకుండా తన పని చేసుకుంటూ చకచకా వెళ్ళిపోతూనే ఉన్నాడు. డబ్బుల కోసం డ్రాలు అన్ని ఓపెన్ చేసి చూసాడు.. కానీ డబ్బులు ఏమీ దొరకలేదు. దీంతో ఆ దొంగ అటు ఇటు చూసి రెండు మందు బాటిల్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈరోజు ఉదయం వైన్ షాప్‌కు వచ్చిన యజమాని.. షాపు వెనకవైపు గోడకు రంధ్రం కనిపించడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. షాప్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకుని దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.


Next Story