రూ.15 లక్షలిస్తేనే శోభనం.. భార్యకు షాకిచ్చిన భర్త

రూ.15 లక్షల నగదు ఇస్తేనే ఫస్ట్‌ నైట్‌కు అంగీకరిస్తానని ఓ ఇంజనీర్‌ కండీషన్‌ పెట్టిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

By అంజి  Published on  7 Jan 2024 6:33 AM GMT
dowry,  harassment, Karnataka, Crime news

రూ.15 లక్షలిస్తేనే శోభనం.. భార్యకు షాకిచ్చిన భర్త

ఉన్నత చదువులు చదివిన వారు సైతం కట్నం కోసం మూర్ఖంగా ప్రవర్తిస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. రూ.15 లక్షల నగదు ఇస్తేనే ఫస్ట్‌ నైట్‌కు అంగీకరిస్తానని ఓ ఇంజనీర్‌ కండీషన్‌ పెట్టిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. బసవగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో భర్త, అతని కుటుంబ సభ్యులపై భార్య ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు రూ.5 లక్షలు ఇచ్చామని, మిగతా డబ్బులు ఇస్తేనే శోభనం అంటున్నాడని సదరు గృహిణి (27) తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. శారీరకంగా హింసిస్తూ తన అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొంది.

కోననకుంటెకు చెందిన 27 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త అవినాష్ వర్మ, అతని కుటుంబ సభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అవినాష్ ఇంజనీర్. ఫిర్యాదుదారుని జూన్ 6, 2022 న వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో నిందితుడు కట్నం వద్దని చెప్పాడు. ఆ మహిళ పెళ్లి చేసుకుని భర్త ఇంటికి వెళ్లిన రోజు వరుడి తండ్రి మీ కుటుంబ సభ్యులు రూ. 15 లక్షలు ఇస్తామని చెప్పారని, ఇవ్వకుంటే ఫస్ట్ నైట్ జరగనివ్వనని బెదిరించారు. ఈ విషయాన్ని మహిళ తల్లిదండ్రులకు తెలియజేసింది. భరణం చెల్లించేందుకు సమయం కావాలని భార్య తల్లిదండ్రులు నిందితుడిని కోరారు. జూన్ 22, 2022న ఫిర్యాదు చేసిన మహిళ తల్లిదండ్రులు రూ.5.8 లక్షలు చెల్లించారు అని మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేని నిందితుడు మిగిలిన 10 లక్షల రూపాయలను తీసుకురావాలని, లేని పక్షంలో ఇంట్లో ఉండనివ్వబోమని బెదిరించాడు. బాధితురాలు స్నానం చేస్తుండగా భర్త తండ్రి ఒళ్ళు గమనించేవాడు. ఈ విషయమై అత్తమామను మహిళ ప్రశ్నించగా.. ఎవరికైనా చెబితే ఇంటి నుంచి గెంటేస్తానని బెదిరించాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో తల్లిదండ్రులు కూతురి భర్త కుటుంబీకులను విచారించగా.. ‘‘మీ కూతురిని మా ఇంటికి అమ్మేశారు. మేం చెప్పినట్లు వినాలి. లేదంటే ఇప్పుడు రూ.15 లక్షలు ఇవ్వాల్సిందేనన్నారు. అనంతరం ఆ మహిళ ఇంటికి వచ్చింది. తనకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు నిందితుడి వద్ద ఉన్నాయని, దీనిపై అడిగితే డబ్బులు చెల్లించి పత్రాలు తీసుకెళ్లాలని అడిగారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

Next Story