మహిళ మెడలోంచి చైన్ కొట్టేసిన దొంగ.. సీసీటీవీలో రికార్డ్

రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో చైన్‌ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. మహిళ మెడలోంచి చైన్‌ స్నాచర్‌ బంగారు గొలుసు లాక్కెళ్లాడు.

By Knakam Karthik  Published on  5 Feb 2025 12:32 PM IST
Crime News, Telangana News, Hyderabad News, Chain Snaching,

మహిళ మెడలోంచి చైన్ కొట్టేసిన దొంగ.. సీసీటీవీలో రికార్డ్

రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో చైన్‌ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. మహిళ మెడలోంచి చైన్‌ స్నాచర్‌ బంగారు గొలుసు లాక్కెళ్లాడు. దీంతో ఆమె కిందపడటంతో గాయాలయ్యాయి. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ దొంగ అక్కడి నుంచి వేగంగా పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Next Story