హన్మకొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మాయ మాటలు చెప్పి ఓ వృద్ధుడు బాలికపై కొద్ది రోజులుగా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. ఈ ఘటన వడ్డేపల్లి పరిమళకాలనీలో చోటు చేసుకుంది. హైయర్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో సూపరింటెండెంట్‌గా పని చేసిన బింగి బిక్షపతి (69) రిటైర్డ్‌ అయ్యి ఇంటి వద్దే ఉంటున్నారు. అతడి ఇంటి పక్కనే ఓ దివ్యాంగుడు తన కూతురితో కలిసి నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రుల మధ్య కలహాలు రావడంతో.. బాలిక తల్లి వారికి దూరంగా ఉంటోంది. తండ్రి దివ్యాంగుడు, తల్లి దూరంగ ఉంటుండంతో బాలిక ఆలనాపాలన చూసేవాళ్లు కరువయ్యారు.

ఇదే అదనుగా భావించిన బిక్షపతి బాలికపై కామంతో కన్నేశాడు. బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. గత కొద్ది రోజులుగా బాలికపై వృద్ధుడు బిక్షపతి అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. మంగళవారం నాడు జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే 100 నంబర్‌కు కాల్‌ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కేయూ సీఐ జనార్దన్ రెడ్డి తెలిపారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story