ఏపీలో తీవ్ర విషాదం.. అదృశ్యమైన ముగ్గరు విద్యార్థులు.. విగతజీవులుగా లభ్యం

The disappearance of three students in AP is a tragic incident. ప్రకాశం జిల్లా టంగూటూరు మండలం ఎం. నిడమానూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం నాడు ఆదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల

By అంజి  Published on  28 Feb 2022 4:17 AM GMT
ఏపీలో తీవ్ర విషాదం.. అదృశ్యమైన ముగ్గరు విద్యార్థులు.. విగతజీవులుగా లభ్యం

ప్రకాశం జిల్లా టంగూటూరు మండలం ఎం. నిడమానూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం నాడు ఆదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల విగతజీవులుగా మారారు. కనిపించకుండా పోయిన ముగ్గురు విద్యార్థులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. పొదవారిపాలెం దగ్గర గల మూసీ వాగులో ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. నిడమానూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు వాసు (15), జగన్‌ (12), మహేష్‌ (13)లు ఆదివారం నాడు మధ్యాహ్నం వరకు ఇళ్ల వద్దే ఉన్నారు. సాయంత్రం 3 గంటల సమయంలో క్రికెట్‌ ఆడుకునేందుకు పొందూరు గ్రామ పంచాయతీ పొదవారిపాలెం దగ్గర్లో గల మూసీ వాగు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే విద్యార్థులు ఈత కొట్టేందుకు వాగులోకి దిగే ప్రయత్నం చేశారు.

అయితే సమీపంలోని వ్యవసాయం చేస్తున్న రైతులు వారిని వారించి.. అక్కడి నుండి పంపారు. సాయంత్రం కావస్తున్నా బాలురు ఇళ్లకు చేరలేదు. దీంతో తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన చెందుతూ కాలనీ వాసులతో గాలించారు. బాలురు మూసీ వాగు దగ్గరకు వెళ్లినట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి వెతికారు. ఇంతలోనే సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించారు. సోమవారం ఉదయం విద్యార్థుల మృతదేహాలు బయపడ్డాయి. తమ పిల్లల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, వారి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story