'మా అమ్మ ప్రియుడు అంటే ఇష్టం.. అందుకే ఆమెను హత్య చేశా'

తన తల్లి ప్రియుడితో ఎఫైర్‌ పెట్టుకున్న కూతురు దారుణానికి ఒడిగట్టింది. తమ ప్రేమకు అడ్డంగిగా మారిందని తల్లిని చంపేసింది.

By అంజి  Published on  24 Sep 2023 2:45 AM GMT
Crime news, Gujarat, Murder

'మా అమ్మ ప్రియుడు అంటే ఇష్టం.. అందుకే ఆమెను హత్య చేశా'

తన తల్లి ప్రియుడితో ఎఫైర్‌ పెట్టుకున్న కూతురు దారుణానికి ఒడిగట్టింది. తమ ప్రేమకు అడ్డంగిగా మారిందని తల్లిని చంపేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో జరిగింది. నిందితులైన మైనర్‌ బాలిక, ఆమె ప్రియుడని ముద్రసాగరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితురాలైన మైనర్‌ బాలిక ప్రస్తుతం బాలల నిర్బంధ కేంద్రంలో ఉంది. నిందితులు తల్లి జ్యోతి (38)ని (పేరు మార్చాం) హత్య చేసి ఆమె మృతదేహాన్ని కచ్ దగ్గర్లోని హమీర్ మోర్ గ్రామ సమీపంలో ఉన్న సముద్రంలో విసిరేశారు. ఈ కేసులో జ్యోతి మైనర్ కూతురు టీనా, యోగేష్ జోతియాలతో పాటు నరేన్ జోగీ అనే మరో వ్యక్తిని సీఆర్‌పీసీ సెక్షన్ 154, ఐపీసీ సెక్షన్లు 302,120 (బీ) కింద అరెస్ట్ చేశారు.

జ్యోతికి యోగేష్‌తో వివాహేతర సంబంధం ఉందని, కానీ ఆమె కూతురు కూడా యోగేష్‌ వలలో పడిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విషయం జ్యోతికి తెలియడంతో ఇద్దరు కలిసి జ్యోతి హత్యకు ప్లాన్‌ వేశారు. షికారు పేరుతో ఓ నిర్మానుష్యప ప్రదేశానికి వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి జ్యోతిని హత్య చేసి సముద్రంలో విసిరేశారు. ఇదిలా ఉంటే.. జులై 10వ తేదీన పని నిమిత్తం బయటకు వెళ్లిన తండ్రి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే తల్లి జ్యోతి అంజర్‌ పట్టణానికి వెళ్లిందని టీనా తన తండ్రికి చెప్పింది. తర్వాత రోజు టీనా తన పిన్నిని కలిసేందుకు వెళ్లింది. 20 రోజులు అవుతున్నా గీతా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో జ్యోతి భర్త జితేంద్రకు అనుమానం వచ్చింది.

వెంటనే మాదాపర్‌ పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి మిస్సింగ్‌ ఫిర్యాదు చేశాడు. ఓ రోజు ముంద్రా పోర్ట్‌ సమీపంలో దొరికిన ఒక డెడ్‌బాడీ ఫొటోను మాదాపర్‌ పీఎస్‌కు పంపారు. అప్పుడే జ్యోతి చనిపోయినట్టు తెలిసిందని, ఆమె దుస్తులను బట్టి జ్యోతి మృతదేహాన్ని గుర్తించానని జితేంద్ర తెలిపారు. డెడ్‌బాడీ దొరికిన ప్రాంతంలోని మొబైల్ టవర్ల డేటాను వెలికితీయడంతో కొత్త సమాచారం వెలుగులోకి వచ్చిందని ముంద్రా పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జడేజా తెలిపారు.

కొన్ని రోజుల క్రితం ఈ ప్రాంతం నుంచి మధ్యాహ్నం 3:18 గంటలకు నరేన్ జోగి అనే ఒక వ్యక్తికి ఫోన్ వెళ్లినట్లు తమకు తెలిసిందన్నారు. పోలీసులు నరేన్‌ జోగిని విచారించగా.. మాదాపర్‌ నుంచి యోగేష్‌ ఓ వ్యాగన్‌ కారులో రేవు సమీప ప్రాంతానికి వచ్చాడని, కారు ఇసుకలో ఇరుక్కుపోవడంతో తనకు ఫోన్‌ చేశాడని, ఆ సమయంలో కారులో ఓ మైనర్‌ బాలికను చూశానని నరేన్‌ చెప్పాడు. జ్యోతిని చంపి ఆమె మృతదేహాన్ని సముద్రంలో విసిరే సమయంలో, వారి కారు ఇసుకలో ఇరుక్కుపోయింది. నరేన్‌కి ఫోన్ చేయాల్సి వచ్చింది. ఆ ఫోన్ వల్ల ఈ నేరం బయటపడిందని పోలీసులు తెలిపారు. యోగేష్‌, టీనా తమ నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు.

Next Story