పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది. దంపతుల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు పెద్ద మనుషుల పంచాయతీలో ఇరువర్గాల తీవ్ర ఘర్షణ ఈ హత్యలకు దారి తీసింది. ఈ క్రమంలోనే మాటమాట పెరగడంతో ఆగ్రహానికి లోనైన ఇరు వర్గాలు ఒక్కసారిగా కత్తులతో దాడికి దిగాయి. ఈ ఘర్షణలో మల్లేశ్, గణేష్‌లకు కత్తిపోట్లకు గురికాగా వారిద్దరూ తీవ్ర రక్తస్త్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.