సిమెంట్ డ్రమ్ము రెడీ అని ప్రియుడికి భార్య మెసేజ్..ప్రాణాలు కాపాడుకోవడానికి భర్త ఏం చేశాడంటే?
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఒక భర్త తన ప్రాణాలను కాపాడుకోవడానికి వినూత్న నిర్ణయం తీసుకున్నాడు.
By - Knakam Karthik |
సిమెంట్ డ్రమ్ము రెడీ అని ప్రియుడికి భార్య మెసేజ్..ప్రాణాలు కాపాడుకోవడానికి భర్త ఏం చేశాడంటే?
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఒక భర్త తన ప్రాణాలను కాపాడుకోవడానికి వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. రాజ్‌కుమార్ అనే వ్యక్తికి వివాహమై, ఆరు నెలల కొడుకు కూడా ఉన్నాడు. అయితే, తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని గ్రహించిన రాజ్‌కుమార్ ఆమెను నిలదీశాడు. దానికి ఆమె ఏమాత్రం తగ్గకుండా, తనకు ప్రియుడు ఉన్నాడని, అతనితోనే వెళ్ళిపోతానని తెగేసి చెప్పింది.
అసలు ట్విస్ట్ ఏంటంటే.. అనుమానం వచ్చి భార్య ఫోన్ చెక్ చేసిన రాజ్‌కుమార్ గుండె ఆగిపోయినంత పనైంది. అందులో ఆమె తన ప్రియుడికి "నీ కోసం సిమెంట్ డ్రమ్ము సిద్ధం చేశాను, ఇక నీ రాక కోసమే ఆలస్యం" అంటూ పంపిన మెసేజ్ చూసి హడలిపోయాడు. ఇటీవలి కాలంలో హత్య చేసి శవాలను ముక్కలు చేసి డ్రమ్ముల్లో దాస్తున్న ఘటనలు గుర్తుకు వచ్చి, భార్య తనను కూడా అలానే మతం చేస్తుందేమోనని భయపడిపోయాడు.
వెంటనే పోలీసులను ఆశ్రయించిన రాజ్‌కుమార్.. "నేను ఇంకొన్ని రోజులు ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాను. ఈమెతో కాపురం చేసి సిమెంటు డ్రమ్ములో శవమై ముక్కలుగా మారే బదులు, ఈమెను ప్రియుడి వద్దకే పంపేయడం మేలు" అని పోలీసుల ముందు వాపోయాడు. చివరకు భార్యను ఆమె కోరుకున్న ప్రియుడి వద్దకే సాగనంపి, ప్రాణాలు దక్కించుకున్నాననే ఊపిరితో పోలీస్ స్టేషన్ నుండి బయటపడ్డాడు.
సిమెంట్ డ్రమ్ము సిద్ధం చేశాను నీదే ఆలస్యంప్రియుడికి భార్య చేసిన మెసేజ్ చూసి భయంతో ఆమెను ప్రియుడి వద్దకు సాగనంపిన భర్తయూపీ రాష్ట్రంలోని బులంద్‌షహర్ ప్రాంతంలో ఓ మహిళను వివాహం చేసుకుని ఆరు నెలల కొడుకుతో కలిసి నివాసముంటున్న రాజ్ కుమార్ అనే వ్యక్తిఇటీవల అతని భార్య ప్రియుడితో… pic.twitter.com/IWMHTpwfyb
— Telugu Scribe (@TeluguScribe) March 20, 2026