తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న బాలిక అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మరణించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన అక్షిత (14) స్థానిక స్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది. అక్షిత అనుమానాస్పద స్థతిలో మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకటాపూర్‌ విలేజ్‌లో బాలిక అమ్మమ్మ, బంధువులు వాహనాన్ని అడ్డుకున్నారు.

బాలికను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. బాలిక మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కాగా బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌కు చెందిన యువతి శ్రీశైలంలో సూసైడ్‌కు యత్నించింది. శ్రీశైలం ప్రధాన ఆలయానికి సమీపంలో మౌనిక రెడ్డి అనే 25 ఏళ్ల యువతి పురుగుల మందు తాగింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story