హైదరాబాద్‌లోని హబ్సిగూడలో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌పై నుంచి దూకి టెన్త్ విద్యార్థిని శ్రీ వైష్ణవి సూసైడ్ చేసుకుంది. మార్కులు తక్కువగా వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు హబ్సిగూడలోని శ్రీ చైతన్య స్కూల్‌లో చదువుతోంది. కాగా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.