‘అమ్మాయిని చంపేశాను.. నన్ను చంపేయండి’

గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక్‌లో 25 ఏళ్ల జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను ఆమె తండ్రి దీపక్ యాదవ్ కాల్చి చంపిన కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

By Medi Samrat
Published on : 12 July 2025 6:00 PM IST

‘అమ్మాయిని చంపేశాను.. నన్ను చంపేయండి’

గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక్‌లో 25 ఏళ్ల జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను ఆమె తండ్రి దీపక్ యాదవ్ కాల్చి చంపిన కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధిక మామ విజయ్ యాదవ్ మాట్లాడుతూ.. హత్య అనంతరం దీపక్.. ‘అమ్మాయిని చంపేశాను.. నన్ను చంపేయండి’ అని దీపక్ తనతో చెప్పాడని చెప్పాడు. అయితే దీపక్ హత్యకు స్పష్టమైన కారణం చెప్పలేదని, అతడు మానసిక సమతుల్యతను కోల్పోయాడని మాత్రమే చెప్పాడని పేర్కొన్నాడు.

ఉరి వేయాలని నిబంధన ఉంటే ఉరి తీయాలని దీపక్ పోలీస్ స్టేషన్‌లో చెప్పాడు. దీపక్ తన కుమార్తెను ఉదయం 5 గంటలకు టెన్నిస్ శిక్షణకు తీసుకువెళ్లేవాడని, సాయంత్రం ఆమెను తిరిగి తీసుకువచ్చేవాడని విజయ్ చెప్పాడు. రాధిక ఇతర కార్యకలాపాలను విడిచిపెట్టి టెన్నిస్‌పై మాత్రమే దృష్టి పెట్టింది.

కొన్ని నివేదికలలో పేర్కొన్నట్లుగా రాధిక ఏ టెన్నిస్ అకాడమీని ప్రారంభించలేదని విజయ్ స్పష్టం చేశాడు. దీపక్ కుటుంబం అప్పటికే సుభిక్షంగా ఉందని, తమ గ్రామంలో చాలా మంది కచ్చా ఇండ్లలో నివసించే సమయంలోనే.. దీపక్‌కు పక్కా ఇల్లు ఉండేదన్నారు. దీపక్ తన తప్పును గ్రహించాలని విజయ్ అంటున్నాడు. ఒక వ్యక్తి తన తప్పుకు పశ్చాత్తాపపడటం కంటే గొప్ప శిక్ష మరొకటి ఉండదన్నాడు.

పోలీసులు దీపక్‌ను అరెస్టు చేసి కుటుంబ కలహాలు, రాధిక సోషల్ మీడియా కార్యకలాపాలు, ఆమె ఆర్థిక స్వాతంత్ర్యంపై వివాదం స‌హా హత్య వెనుక కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story