ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన టెంపో.. ముగ్గురు మ‌హిళ‌లు దుర్మ‌ర‌ణం

Tempo collided with truck in Kadapa.ఆగి ఉన్న లారీని శుక్ర‌వారం తెల్ల‌వారుజామున

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jan 2023 8:16 AM IST
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన టెంపో.. ముగ్గురు మ‌హిళ‌లు దుర్మ‌ర‌ణం

ఆగి ఉన్న లారీని శుక్ర‌వారం తెల్ల‌వారుజామున టెంపో వాహ‌నం ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మ‌హిళ‌లు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో 8 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న కడ‌ప జిల్లాలోని చాపాడ వ‌ద్ద‌ జ‌రిగింది.

ప్రొద్దుటూరు వైఎమ్మార్ కాలనీకి చెందిన 15 మంది కుటుంబ సభ్యులు టెంపో వాహ‌నంలో తిరుమ‌ల‌కు వెళ్లారు. అనంత‌రం తిరిగి వ‌స్తుండ‌గా వీరి వాహ‌నం చాపాడ వ‌ద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మ‌హిళ‌లు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయ‌ప‌డిన మ‌రో 8 మందిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

మృతుల‌ను అనూష, రామ‌ల‌క్ష్మ‌మ్మ‌, ఓబులమ్మగా గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story