అమెరికాలో దారుణం.. దుండగుల కాల్పుల్లో ఏపీ యువకుడు మృతి

అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన

By అంజి  Published on  21 April 2023 12:05 PM IST
America, Telugu student , Gunshots, APnews

అమెరికాలో దారుణం.. దుండగుల కాల్పుల్లో ఏపీ యువకుడు మృతి

అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయిష్‌ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఒహియో స్టేట్ పైన్స్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాడు. అతను కొలంబస్ ఫ్రాంక్లింటన్‌లోని ఫ్యూయల్ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే, బుధవారం (గురువారం మధ్యాహ్నం IST) మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో ఇద్దరు దుండగులు ఇంధన స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండగా కాల్పులు జరిపి నగదు తీసుకున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సాయిష్‌ను ఒహియో హెల్త్ గ్రాంట్ మెడికల్ సెంటర్‌కు తరలించిగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ ఘటనపై గురువారం రాత్రి 8 గంటలకు సమాచారం అందిందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పాలకొల్లు పట్టణానికి చెందిన వీర రమణ నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. అతని చిన్న కుమారుడు సాయిష్ అమెరికాలోని ఓహియో స్టేట్ పైన్స్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లిన సాయిష్.. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడంతోపాటు ఎంఎస్ చివరి సెమిస్టర్ చదివేందుకు గ్యాస్ స్టేషన్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేశాడు. అతడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయిష్ మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story