షాకింగ్‌.. బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య

గచ్చిబౌలిలో కన్నడ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది.

By Medi Samrat  Published on  1 Dec 2024 1:37 PM GMT
షాకింగ్‌.. బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య

గచ్చిబౌలిలో కన్నడ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది. శోభిత సీరియ‌ల్స్‌లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా ప‌నిచేస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు శోభిత ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కన్నడలో ప‌లు సీరియల్స్‌లో నటించిన యాంకర్ శోభిత తనభర్తతో కలిసి గచ్చిబౌలిలోని శ్రీరాం నగర్ కాలనీలో నివాసం ఉంటున్నది.

బ్రహ్మగంతు సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శోభిత(32 ఈరోజు తాను ఉంటున్న ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శోభిత కుటుంబ సభ్యులు శోభిత మృతిపై కారణాలు వెల్లడించలేదు. పోలీసులు శోభిత మృతి దేహంను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story