Telangana: కాషాయ జెండాను అవమానించాడని.. వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగింపు

సంగారెడ్డి జిల్లాలోని ఓ వర్గానికి చెందిన వ్యక్తి కాషాయ జెండాను అవమానించే రీల్‌ను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేసినందుకు ఒక గుంపు అతనిని కొట్టి నగ్నంగా ఊరేగించింది.

By అంజి  Published on  25 Jan 2024 6:27 AM IST
Telangana, saffron flag, Crime news,  Sangareddy

Telangana: కాషాయ జెండాను అవమానించాడని.. వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగింపు

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని ఓ వర్గానికి చెందిన వ్యక్తి కాషాయ జెండాను అవమానించే రీల్‌ను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేసినందుకు ఒక గుంపు అతనిని కొట్టి నగ్నంగా ఊరేగించింది. రీల్‌లో ఓ వర్గానికి చెందిన యువకుడు కాషాయ జెండాను పట్టుకుని దాని పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ సోషల్‌ మీడియా పోస్టు చేశాడు. కాషాయ జెండాపై హిందూ మత చిహ్నం 'ఓం' అని గుర్తు పెట్టాడు, ఆ తర్వాత కాషాయ జెండాను అతని ప్యాంటు లోపల పెట్టుకుని అవమానకరమైన రీతిలో కనిపించాడు. రీలు చూసి ఆగ్రహించిన మెదక్ జిల్లాలోని ఓ గ్రామంలో ప్రజలు అతన్ని గుర్తించి కొట్టారు.

కొన్ని వీడియోలలో గుంపు జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ ఆ యువకుడిని కొట్టడం, అతనిని నగ్నంగా ఊరేగించడం, అతని ప్రైవేట్ భాగాలకు నిప్పు పెట్టడానికి ప్రయత్నించడం వంటివి చూపించాయి. మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తిపై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్లు 153(ఎ), 295-ఎ, 505(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై దాడి చేసినందుకు గ్రామస్థులపై ఆ యువకుడు ఫిర్యాదు కూడా చేశాడు. దీనిపై పోలీసులు స్థానికులపై ఐపీసీ 341, 323, 505(2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసుల తదుపరి విచారణ జరుగుతోంది.

Next Story