Telangana: చేతబడి చేస్తున్నాడని.. వ్యక్తిని గొడ్డలితో నరికి చంపేశాడు

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తిర్యాణి మండలం మాంగి గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టగూడ గ్రామంలో శనివారం రాత్రి చేతబడి చేస్తున్నాడని..

By -  అంజి
Published on : 2 Nov 2025 6:00 PM IST

Telangana, Man hacked to death, sorcery allegations, Adilabad, Crime

Telangana: చేతబడి చేస్తున్నాడని.. వ్యక్తిని గొడ్డలితో నరికి చంపేశాడు

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తిర్యాణి మండలం మాంగి గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టగూడ గ్రామంలో శనివారం రాత్రి చేతబడి చేస్తున్నాడని ఆరోపిస్తూ 50 ఏళ్ల వ్యక్తిని నరికి చంపాడో వ్యక్తి. ఈ సంఘటన ఆదివారం నాడు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తన కుటుంబ సభ్యులపై మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో బాధితుడు హనుమత్ రావుపై సిడం వినోద్ అనే వ్యక్తి గొడవ తర్వాత గొడ్డలితో దాడి చేశాడు.

ఈ ఘటనలో హనుమత్‌ రావు అక్కడికక్కడే రక్తస్రావంతో మరణించగా, అతని భార్య బొజ్జు బాయి జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించడంతో వినోద్‌ ఆమెపై దాడికి దిగాడు. ఈ ఘటనకు బాధితుడి భార్యకు గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాగా హనుమత్‌ రావు కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వినోద్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story