షాకింగ్.. టీనేజ్ బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్.. ఆపై హత్య
అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలో 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసినందుకు నలుగురు యువకులను అరెస్టు చేశారు.
By అంజి Published on 5 Sep 2023 1:30 AM GMTషాకింగ్.. టీనేజ్ బాలికను కిడ్నాప్ చేసిన గ్యాంగ్‌రేప్.. ఆపై హత్య
అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలో 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసినందుకు నలుగురు యువకులను అరెస్టు చేశారు. నలుగురు నిందితులను సోమవారం ఉదయం అరెస్టు చేశామని, జిల్లాలోని బనీపూర్ ధేకేరీ గావ్ పరిసరాల్లో ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అరెస్టయిన యువకులంతా 17 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సు గల దిబ్రూఘర్ పట్టణానికి చెందిన వారు. ఆదివారం రాత్రి ఫిర్యాదు అందుకున్న పోలీసులు సత్వరమే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
“బానీపూర్ ప్రాంతంలోని ఒక నివాసంలో ఓ బాలిక మృతదేహం ఉరి వేసుకున్నట్లు మాకు తెలిసింది. బాలిక బంధువులు ఫిర్యాదు చేయడంతో మేము కేసు నమోదు చేసాము, ”అని ఒక అధికారి తెలిపారు. పోలీసులు మైనర్‌గా అభివర్ణించిన బాలిక ఆదివారం మధ్యాహ్నం కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం దిబ్రూగఢ్ పట్టణానికి వెళ్లినప్పటికీ తిరిగి రాలేదని సమాచారం. “ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు బాలిక కోసం వెతికారు. అమ్మాయికి కొంతమంది అబ్బాయిలు తెలిసి ఉండవచ్చని అనుమానించాం. నేరస్థలానికి తీసుకెళ్లే ముందు ఆమె మత్తులో ఉంది” అని పోలీసులు తెలిపారు.
మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అసోం మెడికల్ కాలేజీ అయిన డిబ్రూఘర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆరోపించిన సంఘటన గురించి స్థానికుల నుండి మేము సమాచారం సేకరించాం. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఆదివారం నాడు ధేకేరి గావ్ గ్రామంలోని ఓ ఇంట్లో బాలుర బృందం పార్టీ చేసుకుంటూ గంజాయి తాగుతూ, ఇంటి లోపలా, బయటా మద్యం సేవిస్తున్నారని స్థానిక వ్యక్తి ఒకరు తెలిపారు.
“వారు సందడిగా పార్టీ చేసుకోవడం మేము చూశాము. అనంతరం వారు వెళ్లిన తర్వాత ఇరుగుపొరుగు వారు ఇంట్లో ఉరివేసుకున్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. నలుగురు యువకులను అరెస్టు చేయగా, ఆదివారం ఎక్కువ మంది అబ్బాయిలు పార్టీలు చేసుకుంటున్నారు, ”అని అతను చెప్పాడు. పోలీసు సూపరింటెండెంట్ శ్వేతాంక్ మిశ్రా.. “ఈ విషయం దర్యాప్తులో ఉంది. మేము ప్రస్తుతానికి మరిన్ని వివరాలను వెల్లడించలేము. ” అని తెలిపారు.