13 ఏళ్ల సోదరిపై అన్న అత్యాచారం.. గర్భం దాల్చడంతో..

గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై ఆమె 16 ఏళ్ల సోదరుడు అత్యాచారం చేశాడు.

By అంజి  Published on  4 Oct 2024 12:42 PM IST
Teen rapes 13-year-old sister, impregnates, Gujarat,Surat, Crime

13 ఏళ్ల సోదరిపై టీనేజ్ అత్యాచారం.. గర్భం దాల్చడంతో..

గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై ఆమె 16 ఏళ్ల సోదరుడు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చిందని పోలీసులు తెలిపారు. కడుపునొప్పితో బాలిక ఫిర్యాదు చేయడంతో తల్లి ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డాక్టర్ బాలికకు మూడు నెలల గర్భం ఉందని చెప్పారు. విచారణలో తనతో శృంగారం చేయమని తన అన్నయ్య అడిగాడని బాలిక తన తల్లికి చెప్పింది.

బాలిక నిరాకరించడంతో నిందితుడు ఆమెపై రెండుసార్లు అత్యాచారం చేసి, తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరించారు. ఈ ఘటన అనంతరం బాలిక తల్లి సెప్టెంబర్ 30న బాలుడిపై కేసు నమోదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ రోజూ ఉదయం ఇంటి నుంచి పని నిమిత్తం వెళ్లేవారని, పిల్లలిద్దరూ ఇంట్లో ఒంటరిగా ఉండేవారని పోలీసులు తెలిపారు. 8వ తరగతి చదువుతున్న బాలికకు పాఠశాలలో కడుపునొప్పి ఉందని చెప్పడంతో ఆమె తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లిందని, బాలిక మూడు నెలల గర్భం దాల్చినట్లు డాక్టర్ నిర్ధారించారని పోలీసులు తెలిపారు.

Next Story