హైదరాబాద్‌లో టెక్కీ మర్డర్..రెండో పెళ్లి చేసుకుందనే కసితో కిరాతకానికి ఒడిగట్టిన మాజీ భర్త
వనస్థలీపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో బుధవారం ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ (30) దారుణ హత్యకు గురయ్యారు.
By - Knakam Karthik |
హైదరాబాద్‌లో టెక్కీ మర్డర్..రెండో పెళ్లి చేసుకుందనే కసితో కిరాతకానికి ఒడిగట్టిన మాజీ భర్త
హైదరాబాద్: వనస్థలీపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో బుధవారం ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ (30) దారుణ హత్యకు గురయ్యారు. ఆమె మాజీ భర్త మహేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల విడాకులు తీసుకున్న సునీత, మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక మహేష్ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం.. సునీత కొద్ది రోజుల క్రితమే మహేష్‌తో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె రెండో వివాహం చేసుకున్నారు. ఈ పరిణామంతో తీవ్ర అసూయ, కక్ష పెంచుకున్న మహేష్, ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పథకం వేశాడు.
నిందితుడు మహేష్ రెండు కత్తులు, పెట్రోల్ క్యాన్‌తో సునీత నివాసంలోకి చొరబడ్డాడు. తొలుత ఆమెతో వాగ్వాదానికి దిగిన నిందితుడు, ఆ తర్వాత ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. సునీతను కత్తులతో పలుమార్లు విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం తలపై పూల కుండీతో బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి మరణించింది. దాడి అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన మహేష్‌ను పోలీసులు గాలింపు చేపట్టి, కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విడాకుల తర్వాత సునీత తీసుకున్న పునర్వివాహం నిర్ణయాన్ని మహేష్ అంగీకరించలేకపోవడమే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.
సునీత రెండు నెలల గర్భవతి?
భర్త చేతిలో హత్యకు గురైన సునిత రెండు నెలల గర్భవతి గా ఉంది...మొదటి పెళ్ళి జరిగిందన్న విషయం రెండవ భర్త కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేదు.సునీత హత్యకు గురైన తరువాతనే మొదటి పెళ్ళి విషయం తెలియడంతో బంధువులు ఆశ్చర్య చకితులయ్యారు. ప్రస్తుతం రెండవ భర్త త్రినాథ్, సునిత లు ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే... మీర్‌పేట్ మర్డర్ కేసు తరహాలో సునితను హత్య చేసి శవాన్ని మాయం చేయాలనుకున్నాడు. అందుకోసం మహేశ్.. కట్టర్ లు, ఐదు లీటర్ల పెట్రోల్ వెంట తెచ్చుకున్నారు. సునీత, ఏడాది ప్రేమించి త్రినాథ్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నది.త్రినాథ్ ను సునిత పెళ్ళి చేసుకోవ డంతో మహేష్ కక్ష్య పెంచుకున్నాడు. మృతురాలు మూడు నెలల గర్భవతి అని ఆమె భర్త ఫిర్యాదులో పేర్కొనగా, పోస్ట్‌మార్టం నివేదిక ద్వారా అది నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.