Hyderabad: కుటుంబ సమస్యలతో టెక్కీ సూసైడ్‌

తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ నగర్‌లో సోమవారం రాత్రి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

By అంజి
Published on : 23 July 2024 6:00 PM IST

Techie, suicide, Tellapur, Hyderabad,,family issues, Crime

Techie, suicide, Tellapur, Hyderabad,,family issues, Crime

సంగారెడ్డి: తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ నగర్‌లో సోమవారం రాత్రి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యుత్‌నగర్‌లో నివాసముంటున్న కిరణ్‌(25) మంగళవారం ఉదయం తన స్నేహితులు, బంధువుల నుంచి ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో అతని స్నేహితులు ఇంటికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాడు. కిరణ్ కొంతకాలం నుంచి విప్రోలో పనిచేస్తున్నారు.

తాను డిప్రెషన్‌లో ఉన్నానని, కుటుంబ సమస్యల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టానని సూసైడ్ నోట్‌ను వదిలిపెట్టాడు. కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కిరణ్ రాసిన సూసైడ్ లెటర్ ఆధారంగా చేసుకుని కొల్లూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నా రు. కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story