టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు.. భార్య, అత్త, బావమరిది అరెస్ట్

టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్యకు సంబంధించి విడిపోయిన అతని భార్య నికిత, అత్త నిశా, బావమరిది అనురాగ్‌ను బెంగళూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

By అంజి  Published on  15 Dec 2024 9:41 AM IST
Techie Atul Subhash, wife, arrest, suicide, Crime

టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు.. భార్య, అత్త, బావమరిది అరెస్ట్

టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్యకు సంబంధించి విడిపోయిన అతని భార్య నికిత, అత్త నిశా, బావమరిది అనురాగ్‌ను బెంగళూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుభాష్ సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య, ఆమె కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపిస్తూ 24 పేజీల నోట్, వీడియోను వదిలివేసాడు. సుభాష్ భార్య నికితా సింఘానియాను గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా, ఆమె తల్లి నిషా సింఘానియా, సోదరుడు అనురాగ్ సింఘానియాను ప్రయాగ్‌రాజ్‌లో అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు సిటీ పోలీసులు నికితా, ఆమె కుటుంబ సభ్యులపై ఆత్మహత్యకు ప్రేరేపించారని కేసు నమోదు చేసిన తర్వాత అరెస్టులు జరిగాయి.

నిందితులు గతంలో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. నికితా మూడు రోజుల్లోగా తమ ముందు హాజరుకావాలని శుక్రవారం జారీ చేసిన పోలీసు సమన్ల నేపథ్యంలో నికితా, ఆమె తల్లి, సోదరుడు, మామ సుశీల్ సింఘానియా ఈ దరఖాస్తులను దాఖలు చేశారు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న అతుల్ సుభాష్ తన సూసైడ్ నోట్‌లో, తన భార్య, ఆమె కుటుంబం, ఉత్తరప్రదేశ్‌లోని ఒక న్యాయమూర్తి వేసిన వేధింపులు, అనేక కేసుల కారణంగా చాలా సంవత్సరాలు మానసిక క్షోభకు గురైనట్లు పేర్కొన్నాడు.

ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, తన భర్త కట్నం కోసం వేధింపులకు గురిచేశారని, దాడి చేశారంటూ నికితా 2022లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు వెలువడ్డాయి. పెళ్లి తర్వాత సుభాష్, అత్తమామలు మరో 10 లక్షలు కట్నంగా డిమాండ్ చేశారని నికిత ఫిర్యాదులో పేర్కొంది. సుభాష్ తనను కొట్టేవాడని, భార్యాభర్తల సంబంధాన్ని "మృగంలా" చూడటం ప్రారంభించాడని ఆమె ఆరోపించింది.

Next Story