Hyderabad: తోటి ఉపాధ్యాయుల వేధింపులు.. తట్టుకోలేక టీచరమ్మ ఆత్మహత్య

ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న 29 ఏళ్ల ఉపాధ్యాయురాలిని ఇద్దరు మగ సహచరులు "వేధించడం" కారణంగా.. ఆమె తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

By -  అంజి
Published on : 22 Sept 2025 9:43 AM IST

Teacher ends life, harassment, two colleagues, Hyderabad, Crime

Hyderabad: తోటి ఉపాధ్యాయుల వేధింపులు.. తట్టుకోలేక టీచరమ్మ ఆత్మహత్య

హైదరాబాద్‌: ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న 29 ఏళ్ల ఉపాధ్యాయురాలిని ఇద్దరు మగ సహచరులు "వేధించడం" కారణంగా.. ఆమె తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన సెప్టెంబర్ 19న జరిగింది. ఆ మహిళ భర్త ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు, ఆమె పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు తన భార్యను "వేధించారని, అసభ్యకరంగా ప్రవర్తించారని" ఆరోపించాడు, దీని కారణంగా ఆమె ఉరి వేసుకుందని అతడు ఆదివారం నాడు తెలిపాడు.

ఆమె భర్త సెప్టెంబర్ 20న దాఖలు చేసిన ఫిర్యాదులో.. తాను, అతని భార్య ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నామని, జీవనోపాధి కోసం అస్సాం నుండి హైదరాబాద్‌కు వచ్చామని పేర్కొన్నాడు. గత ఆరు నెలలుగా వారిద్దరూ తన భార్యను వేధించారని, అయితే తాను గతంలో వారిని ఫోన్‌లో మందలించానని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు.

అయితే, సెప్టెంబర్ 15న తాను అస్సాంకు వెళ్లిన తర్వాత వేధింపులు తీవ్రమయ్యాయని, చివరికి తన భార్య ఆత్మహత్య చేసుకునేలా దారితీసిందని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా, ఇద్దరు ఉపాధ్యాయులపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

Next Story