ఏపీలో కలకలం.. తుపాకీతో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎస్సై మూర్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీస్ స్టేషన్‌లో తుపాకీతో కాల్చుకున్నాడు.
By అంజి Published on 31 Jan 2025 9:44 AM ISTఏపీలో కలకలం.. తుపాకీతో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎస్సై మూర్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీస్ స్టేషన్‌లో తుపాకీతో కాల్చుకున్నాడు. తణుకు రూరల్ ఎస్సైగా పని చేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తనను సస్పెండ్ చేశారన్న మనస్తాపంతోనే మూర్తి సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్సై మృతదేహాన్ని 108 వాహనంలో తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే షేర్ మార్కెట్ లో కోటి రూపాయల నష్టం రావడంతో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నగరంలోని అంబర్ పెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఏ.వెంకటేష్ అంబర్‌పేట్ లోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. షేర్ మార్కెట్‌లో కోటి రూపాయల వరకు లాస్ అవ్వడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మాదన్నపేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏ. వెంకటేశ్వర్లు( 42).. 2007 బ్యాచ్ కానిస్టేబుల్. గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అంబర్పేట్ దుర్గా నగర్లో తన ఇంట్లో ఫ్యాన్కి చున్నీతో ఉరి వేసుకొని చనిపోయాడు. అతనికి భార్య.. ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. వీరి స్వస్థలం సూర్యాపేట.