చికిత్స చేయిస్తానని తీసుకెళ్లి.. బాలికపై తాంత్రికుడు అత్యాచారం
'Tantrik' rapes minor girl in Uttar Pradesh on pretext of treating her. మైనర్ బాలికకు నాటు వైద్యం చేయిస్తానన్న సాకుతో ఆమెపై అత్యాచారం
By అంజి Published on 2 Jan 2023 2:30 PM IST
ఈ రోజుల్లో కూడా చాలా మంది మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. ఈ మూఢనమ్మకాల వల్ల నేరాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది. మైనర్ బాలికకు నాటు వైద్యం చేయిస్తానన్న సాకుతో ఆమెపై అత్యాచారం చేసినందుకు ఓ తాంత్రికుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో జరిగింది. నిందితుడిపై సంబంధిత ఐపీసీ, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 14 ఏళ్ల బాలిక గత మూడు సంవత్సరాలుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతోంది.
ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. డిసెంబర్ 24న బాలిక తండ్రి లేని సమయంలో అశోక్ కుమార్ (45) అనే తాంత్రికుడు వారి ఇంటికి వచ్చి "దుష్టశక్తులను వదిలించడానికి" మీ కూతురిని తనతో పంపమని ఆమె తల్లిని ఒప్పించాడు. నిందితులు బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పిప్రి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ శ్రవణ్ కుమార్ సింగ్ కేసును ధృవీకరించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు సంబంధిత ఐపీసీ, పోక్సో సెక్షన్ల కింద శనివారం నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఆదివారం అరెస్టు చేశారు.
ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో 7వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. జిల్లాలోని గోరఖ్‌నాథ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె కుటుంబ సభ్యులు స్వగ్రామానికి వెళ్లారు. బాలిక ఆత్మహత్యకు ముందు ఇంటి యజమాని, ఇతర అద్దెదారులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.