ఇంట‌ర్ విద్యార్థితో మ‌హిళా లెక్చ‌ర‌ర్ ప‌రారీ.. ఆపై పెళ్లి

Tamil Nadu teacher arrested for marrying minor student.స‌మాజంలో గౌర‌వ‌ప్ర‌ద‌మైన ఉపాధ్యాయ వృత్తిలో కొన‌సాగుతున్న ఓ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 March 2022 12:02 PM IST
ఇంట‌ర్ విద్యార్థితో మ‌హిళా లెక్చ‌ర‌ర్ ప‌రారీ.. ఆపై పెళ్లి

స‌మాజంలో గౌర‌వ‌ప్ర‌ద‌మైన ఉపాధ్యాయ వృత్తిలో కొన‌సాగుతున్న ఓ టీచ‌ర్ దారి త‌ప్పింది. విద్యార్థుల‌ను మంచి మార్గంలో న‌డిపించాల్సిన ఉపాధ్యాయురాలు.. ఓ విద్యార్థి తో ప్రేమ‌లో ప‌డింది. ఇంట‌ర్ చ‌దువుతున్న మైన‌ర్ బాలుడిని ఇంట్లోంచి తీసుకువెళ్లి పెళ్లి చేసుకుంది. ఆ విద్యార్థి త‌ల్లిదండ్రుల ఫిర్యాదుతో అస‌లు నిజం వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న తమిళ‌నాడు రాష్ట్రంలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. తురైయూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఓ విద్యార్థి(17) ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. అదే కళాశాల‌లో 26 ఏళ్ల ష‌ర్మిల అనే మ‌హిళా లెక్చ‌ర‌ర్ ప‌ని చేస్తోంది. అయితే.. ఈ నెల 5వ తేదీ నుంచి విద్యార్థి క‌నిపించ‌కుండా పోయాడు. అత‌డి కోసం ఎంత వెతికినా లాభం లేక‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో పోలీసుల‌కు షాకింగ్ విష‌యాలు తెలిశాయి.

యువ‌కుడు చ‌దువుకుంటున్న కాలేజీలో ఆరా తీయ‌గా.. అదే కాలేజీలో ప‌నిచేస్తున్న ష‌ర్మిల అనే లెక్చ‌ర‌ర్ కూడా ఆ రోజు నుంచే క‌న‌ప‌డ‌డం లేద‌ని గుర్తించారు. ఆమెపై పోలీసుల‌కు అనుమానం క‌లిగింది. ఆ కోణంలో ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా అస‌లు నిజం తెలిసింది. విద్యార్థితో క‌లిసి లెక్చ‌ర‌ర్ పారిపోయిన‌ట్లు గుర్తించారు. ష‌ర్మిల సెల్‌సిగ్న‌ల్ ఆధారంగా వారిని ప‌ట్టుకున్నారు. అనంత‌రం ష‌ర్మిల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెపై ఫోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

Next Story