తమిళనాడులోని విలుప్పురం జిల్లాలో మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై 77 ఏళ్ల వ్యక్తితో సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన బృందంలో మైనర్ బాలిక యొక్క ఇద్దరు బంధువులు కూడా ఉన్నారు. ఓ జాతీయ దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. గత సంవత్సరం జూలై నుండి బాలికపై దాడి జరిగింది. ఇద్దరు బంధువులు, పొరుగువారితో సహా ఎనిమిది మంది వ్యక్తులు ఈ నేరంలో పాల్గొన్నారని ఆరోపించారు. ప్రస్తుతం బాలిక ఆరు నెలల గర్భిణి.
బాలిక తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత.. కొద్ది రోజులకు తల్లి చనిపోవడంతో మైనర్ బాలిక అత్త ఇంట్లోనే ఉంటోందని పోలీసులు తెలిపారు. ఇటీవల బాలిక అస్వస్థతకు గురైంది. ఆమెను బంధువులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. రోగ నిర్ధారణ చేయగా బాలిక గర్భం దాల్చింది అని తేలింది. ఆరోగ్యశాఖ అధికారులు పోలీసులను అప్రమత్తం చేయడంతో ఎనిమిది మంది వ్యక్తులు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితులపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు అభియోగాలు మోపారు. ఈ కేసులో ప్రమేయమున్న మరో నిందితుడిని పట్టుకునేందుకు విచారణ కొనసాగుతోంది.