9 రోజుల పసికందుకు విషమిచ్చి.. మృతదేహాన్ని పెరట్లో పాతిపెట్టిన తల్లిదండ్రులు

తమిళనాడులో దారుణం వెలుగు చూసింది. తమిళనాడులోని వెల్లూరు పోలీసులు తమ తొమ్మిది రోజుల పసికందు మృతికి సంబంధించి దంపతులను అరెస్టు చేశారు.

By అంజి  Published on  8 Sept 2024 2:20 PM IST
Tamil Nadu, arrest, Crime, Vellore

9 రోజుల పసికందుకు విషమిచ్చి.. మృతదేహాన్ని పెరట్లో పాతిపెట్టిన తల్లిదండ్రులు

తమిళనాడులో దారుణం వెలుగు చూసింది. తమిళనాడులోని వెల్లూరు పోలీసులు తమ తొమ్మిది రోజుల పసికందు మృతికి సంబంధించి దంపతులను అరెస్టు చేశారు. తమకు రెండో ఆడపిల్ల వద్దు అనే కారణంతో తమ చిన్నారికి విషమిచ్చి చంపేశామని ఆ దంపతులు తెలిపారు. ఇప్పటికే రెండేళ్ల కుమార్తె ఉన్న సి జీవా, జె డయానా దంపతులకు ఆగస్టు 27న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండో బిడ్డకు జన్మనిచ్చారు. తర్వాత డయానాకు ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తడంతో వేలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత.. మరో ఆడపిల్లను పెంచడం భారమవుతుందని భావించిన దంపతులు అప్పుడే పుట్టిన కూతురికి విషపు పాలు తాగించినట్టు సమాచారం. శిశువు చనిపోవడంతో.. దంపతులు బంధువులకు తెలియజేయకుండా ఆమె మృతదేహాన్ని తమ పెరట్లో పూడ్చిపెట్టారు. తర్వాత డయానా తన తండ్రి శరవణన్‌కు ఫోన్ చేసి పాప అపస్మారక స్థితిలో ఉండి చనిపోయిందని పేర్కొంది. శరవణన్ తన మనవరాలి అనుమానాస్పద మృతిపై సెప్టెంబర్ 4న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు వచ్చి విచారించగా, దంపతులు తమ ఇంటి నుంచి పారిపోయినట్లు గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు సెప్టెంబర్ 5న జిల్లా కలెక్టర్ సమక్షంలో అధికారులు శిశువు మృతదేహాన్ని వెలికితీశారు. తల్లిదండ్రుల జాడ కోసం వేలూరు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు, చివరికి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. విచారణ కొనసాగుతున్నందున వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Next Story