ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. ఆరుగురు మృతి

Tamil Nadu 6 killed, 10 hurt as bus rammed into parked lorry. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లోడ్ లారీని బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటన చెంగల్పట్టు

By అంజి  Published on  8 July 2022 1:25 PM IST
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. ఆరుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లోడ్ లారీని బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటన చెంగల్పట్టు ప్రాంతంలోని తోలపెడు సమీపంలో చెన్నై-తిరుచ్చి నేషనల్‌ హైవేపై ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం 9 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికిపైగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. బస్సు చెన్నై నుంచి చిదంబరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చెంగల్పట్టు, మధురాంతకం ప్రభుత్వాసుపత్రుల్లో చేర్చించారు. సమయానికి వైద్యం అందక ఆస్పత్రిలో బాధితుల్లో ఒకరు మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం ధాటికి బస్సు ఎడమ భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదం కారణంగా చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్‌ అయ్యింది.


Next Story