ఇండిగో 6ఈ-1052 బ్యాంకాక్-ముంబై విమానంలో మహిళా సిబ్బందిని వేధించినందుకు స్వీడిష్ జాతీయుడిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తిని క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్మ్ (62)గా గుర్తించారు. ఈ సంఘటన జరిగిన సమయంలో అతను తాగి ఉన్నాడు. ఆహారం కొనుగోలు కోసం చెల్లింపులు చేస్తున్నప్పుడు మహిళా సిబ్బందిని అతడు అనుచితంగా తాకాడు.
24 ఏళ్ల ఎయిర్ హోస్టెస్‌తో విమానంలో భోజనం వడ్డిస్తున్న సమయంలో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతోపాటు సహ ప్రయాణికుడిపై దాడి చేసి విమానంలో అల్లకల్లోలం సృష్టించాడు. ఈ కేసులో నిందితుడైన ఎరిక్ ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు విమానంలో చికెన్ తీసుకోగా, డబ్బు చెల్లించడానికి ఎయిర్ హోస్టెస్ పిఓఎస్ మెషీన్‌తో అతన్ని సంప్రదించినప్పుడు, కార్డ్ స్వైప్ చేయాలనే సాకుతో అనుచితంగా ప్రవర్తించాడు. చేయి పట్టుకుని వేధించాడని ఎయిర్ హోస్టెస్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇతర ప్రయాణికులను కూడా దుర్భాషలాడాడని ఎయిర్ హోస్టెస్ ఆరోపించింది. నిందితుడిని ముంబయి విమానాశ్రయానికి చేరుకోగానే పోలీసులు అరెస్టు చేశారు. అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అతడికి బెయిల్ వచ్చింది.