విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అనుమానాస్పద మృతి

Suspicious death of six members of the same family in Haryana. శుక్రవారం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని

By అంజి  Published on  26 Aug 2022 11:58 AM IST
విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అనుమానాస్పద మృతి

శుక్రవారం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని అంబాలాలోని బలానా గ్రామంలో జరిగింది. మృతి చెందిన వారిని సంగత్ రామ్, భార్య మహిందర్ కౌర్, కుమారుడు సుఖ్‌విందర్ సింగ్, సుఖ్‌విందర్ భార్య రీనా, వారి మైనర్ కుమార్తెలు అషు, జస్సీగా గుర్తించారు. సుఖ్‌విందర్ సింగ్ ఉరివేసుకున్నాడు. మిగతావారు విషం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుఖ్‌విందర్‌ సింగ్‌ ఉరివేసుకునే ముందు తన కుటుంబానికి విషమిచ్చి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, క్రైం టీమ్‌తో కలిసి ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. సుఖ్వింద‌ర్ ఓ ప్రైవేటు కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. పోస్టుమార్ట‌మ్ కోసం మృత‌దేహాల‌ను అంబాలా సిటీ సివిల్ ఆస్పత్రికి త‌ర‌లించారు. కుటుంబ సభ్యుల అనుమానాస్పద మృతి వెనుక కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంబాలా డీఎస్పీ జోగిందర్ శర్మ మాట్లాడుతూ.. బాలనా గ్రామంలోని వారి ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Next Story