భార్యపై అనుమానంతో బిడ్డకు విషపూరిత ఇంజెక్షన్ ఎక్కించాడు..!
Suspecting Wife's Affair, Odisha Man Injects Baby With Pesticide. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన కుమార్తెకు
By M.S.R Published on 30 May 2023 8:45 PM ISTSuspecting Wife's Affair, Odisha Man Injects Baby With Pesticide
తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన కుమార్తెకు విషపూరిత ఇంజెక్షన్‌ను ఎక్కించాడని పోలీసులు తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పసికందును ఆసుపత్రిలో చేర్చగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. మంగళవారం వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కానందున సుమోటోగా కేసు నమోదు చేశామని బాలాసోర్ పోలీసు సూపరింటెండెంట్ సాగరిక నాథ్ పిటిఐకి తెలిపారు.
ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి తన భార్యకు వివాహేతర సంబంధం కలిగి ఉందని అనుమానంతో ఈ పని చేశాడని గుర్తించాం. చందన్ మహానాగా గుర్తించబడిన నిందితుడు, శిశువు తండ్రిని తాను కాననే అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. చందన్, తన్మయిలకు గతేడాది వివాహమై మే 9న ఓ పాప జన్మించిందని పోలీసులు తెలిపారు. ప్రసవం తర్వాత తల్లిదండ్రుల ఇంట్లో తన భార్య ఉండగా.. చందన్ కుమార్తెను చూడడానికి అక్కడికి వెళ్ళాడు. పాప ఏడుపు విన్న తన్మయి వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చి చూడగా భర్త చేతిలో సిరంజి, క్రిమిసంహారక బాటిల్ కనిపించాయి.
ఆమె తన భర్తను ప్రశ్నించింది. మొదట అతను తాను ఎటువంటి తప్పు చేయలేదని అన్నాడు. కాని తరువాత నవజాత శిశువుకు పురుగులమందును ఎక్కించినట్లు చెప్పాడు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి చిన్నారిని తీసుకుని వెళ్లారు. వెంటనే ఆ మహిళ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పసికందును సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. శిశువు పరిస్థితి విషమించడంతో బాలాసోర్‌లోని ఆసుపత్రికి తరలించారు.