హైదరాబాద్: పోచారం కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోరక్ష కార్యకర్త సోనుపై హత్యాయత్నం చేసిన అనంతరం ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరు నిందితులు నిన్న రాత్రి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు లొంగిపోయారు. దీంతో రాచకొండ పోలీసులు వెంటనే హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల నుండి ఆ ముగ్గురు నిందితులను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు.
బాధితుడు ప్రశాంత్ అలియాస్ సోను పది రోజుల్లో నాలుగు సార్లు గోవులను అడ్డుకున్నాడు. ఇలా ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు నాలుగు సార్లు అడ్డుకోవడంతో ఇబ్రహీం అండ్ గ్యాంగ్ తీవ్ర ఆగ్రహం చెంది ఎలాగైనా సరే సోనును అంతం చేయాలని ప్లాన్ చేశారు. ఈ పథకంలో భాగంగానే శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా ఫోన్ చేసి పోచారం పిలిపించుకున్నాడు ఇబ్రహీంపై ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్లో గోవుల అక్రమ రవాణా కేసు నమోదైంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.