హాస్టల్ గదిలో ఉరేసుకున్న విద్యార్థిని.. ఫేర్‌వెల్‌ పార్టీకి వెళ్లి వచ్చాక..

రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కళాశాల ఆవరణలో జరిగిన వీడ్కోలు పార్టీకి హాజరైన కొన్ని గంటల తర్వాత శనివారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని కనిపించింది.

By అంజి
Published on : 11 Feb 2024 2:05 PM IST

Suryapet , college student, Crime news, suicide

హాస్టల్ గదిలో ఉరేసుకున్న విద్యార్థిని.. ఫేర్‌వెల్‌ పార్టీకి వెళ్లి వచ్చాక..

రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కళాశాల ఆవరణలో జరిగిన వీడ్కోలు పార్టీకి హాజరైన కొన్ని గంటల తర్వాత శనివారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని కనిపించింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఇమాంపేట గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాలలో జరిగింది. సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల నుండి దాదాపు రాత్రి 9.30 గంటలకు, పార్టీ ఇంకా జరుగుతుండగా ఈ ఘటన నివేదించబడింది. మృతురాలు సూర్యాపేటలోని 9వ వార్డులోగల ఎన్టీఆర్ కాలనీ వాసిగా తోటి విద్యార్థినిలు తెలిపారు.

విద్యార్థిని ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలిసిన వివరాల ప్రకారం.. విద్యార్థిని తన గదికి వచ్చి చనిపోయే ముందు తన తల్లికి వీడియో కాల్ చేసింది. విద్యార్థిని మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, అసలు నిజాన్ని వెలుగులోకి తెచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆమె కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్‌ చేశారు.

Next Story